మరుగేలరా ,ఓ రాఘవా?
మరుగేల ? చరాచార రూప ,పరాత్పర ,సూర్య సుధాకర లోచన !.....................మరుగేలరా?
అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య !
నిన్నే గాని మదిని,ఎన్నజాలనారుల ,
నన్ను బ్రోవుమయ్య ,త్యాగరాజనుత,
త్యాగరాజు అంతర్ముఖుడై శోధించి,ఈ చరాచర జగత్తు సర్వం శ్రీ రాముడే అని ఎరిగిన తరువాత ఇతరులని ఎలా ఆశ్రయించగలనని అంటూ తనని కావమని శ్రీ రాముని వేడుకుంటాడు.ఇది సంపూర్ణ శరణాగతి.
సత్యం ఒకటే అని తెలిసిన జ్ఞాని లక్షణం ఇది.అన్నీ తెలిసిన పరాత్పరునికి ఏ విషయం లోను దాపరికం ఉండబోదు.
నటభైరవి జన్యరాగామైన జయంతశ్రీ రాగంలో త్యాగరాజు రచించిన ఈ కీర్తన తప్ప వేరే ఏ రచనలు లేవు.
సంపూర్ణ శరణాగతి తో పరమ భక్తుడైన త్యాగరాజు తన మనసుని నివెదిస్తూ పాడిన ఈ కీర్తనని ఒక దర్శక ప్రముఖుడు నాయిక నాయకునికి తన మసుని నివేదిన్చుకునే సదర్భంలో ఉపయోగించుకోడం క్షమించరాని నేరం కాదా?

THURSDAY, AUGUST 4, 2011
త్యాగరాజ వైభవం (త్యాగరాజ కీర్తనలకి వివరణ)
నేను ఆంధ్రజ్యోతి డైలీ లో(Tirupat edition) నిర్వహించిన ``కళాజ్యోతి' సంస్కత్రితిక పేజి లో ధారావాహికంగా రాసిన శీర్షిక ``త్యాగరాజ వైభవం''సంగీత సాహిత్య ప్రియులకోసం ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాను.సంగీతసాహిత్య ప్రియులని ఈ బ్లాగ్ అలరిస్తుందని ఆసిస్తూ
మీ
మురళి మోహన్
మీ
మురళి మోహన్