Saturday, November 26, 2011

సామజ వర గమనా!(హిందోళ)

సామ జ వర గమనా ! సాదు హ్రుత్సారసాబ్జ పాల ,కాలాతీత విఖ్యాత !

సామ నిగమ జ సుధామయ గాన విచక్షణ ,గుణశీల !
దయాలవాల ! మాం పాలయ ..............................సామ జ వర గమన......


వేదశిరో మాత్రు జ సప్తస్వర! నాదాచల దీపా ..స్వీకృత ..
యాదవ కుల మురలీవాదన ,వినోద మోహనాకార
త్యాగరాజ వందనీయ ......................................... సామ జ వర గమన..........

శ్రీరాముని అతీత గుణ సౌందర్యాన్ని వర్ణిస్తూ మురలీగాన వినోది అయిన శ్రీకృష్ణునితో రాముని కలిపివేసి ఆ మొహనరూపాన్నిత్యాగయ్య కీర్తిస్తున్నారు.అమృతంతో సమానమైన గానం సామవేదం నుండి పుట్టింది. సంగీతం లోని సప్తస్వరాలు ఆ వేద శిఖరాల మీద సప్తగిరుల వలె ఉద్భవించాయి.ఈ స్వరాలనుంది ఉద్భవించిన నాదం చలించని దీపం-అంటే ఈ దివ్య నాదం తెంపు గాని స్ఖాలిత్యం గాని లేనిదట!
సామజము అంటే సామ వేదం నుండి పుట్టినది -ఏనుగు.రాముడు దాని నడకలా గంభీరంగా నడచేవాడు
ఇక సంగీతం కూడా సామ వేదం లోనుంచే పుట్టింది . సంగీత స్వర రూపుడైన శ్రీ రామచంద్ర మూర్తి సామ జ వరగమనుడు అనడం పదప్రయోగ రుచిరత్వం.సాదు-హృత్-సారస= సత్పురుషుల మానసములు అనెడి
తామరలు ,అబ్జపాల =నీటిలో పుట్టే కమలాలని పాలించే వాడు(సత్పురుషుల హృదయాలనే కమలాలను పాలించేవాడు)=సూర్యుడు.మాటలను విడదీయడం,కలపడం ఈ పండిత భక్తునికి కూసు విద్య. మనకి ప్రీతిదాయకం.

చాలామందికి ఏనుగు  సామవేదం నుండి పుట్టడం ఏమిటి అనే సందేహం రావొచ్చు.
సామవేదం లో ప్రస్ఫుటమైన స్వరాలు నాలుగు.అవి గ-రి-స-ని. సంగీత శాస్త్రం ప్రకారం ఏనుగు ఘీంకారం నుండి
ని (నిషాదం) పుట్టినదంటారు.కనుక ఏనుగు  సామ గానమైంది.సామ జ వర గమన అనడంలో త్యాగరాజు హృదయం మనకి ఇప్పుడు అవగతమవుతుంది.

త్యాగ రాజు ఈ కీర్తనని హిందోళ రాగంలో పాడారని చెపుతారు.ఆయన హిందోళ రాగం శుద్ధ దైవతం ఉపయోగిస్తూ పాడారు.ఆతరువాత పర్షియన్  సంగీత  ప్రభావం పడి,చతుశ్రుతి దైవతం తో పాడడం సంప్రదాయం అయింది

మాల్కోన్స్ రాగంలో మనకి తెలిసిన పాటలు 
. ఆధాహై చంద్రమా రాత్ ఆది  (నవరంగ్)
.మన్ తడ్పత్ హరి దర్శన్ కో ఆజ్ (బైజు బావరా)
.పగలే వెన్నెలా ,జగమే ఊయల ( పూజాఫలం)
.సందేహించకుమమ్మ  (లవకుశ)
.మనసే అందాల బృందావనం.
ఇంకా ఎన్నో పాటలు వున్నాయి

THURSDAY, AUGUST 4, 2011

త్యాగరాజ వైభవం (త్యాగరాజ కీర్తనలకి వివరణ)

నేను ఆంధ్రజ్యోతి డైలీ లో(Tirupat edition) నిర్వహించిన ``కళాజ్యోతి'సంస్కత్రితిక పేజి లో ధారావాహికంగా రాసిన శీర్షిక ``త్యాగరాజ వైభవం''సంగీత సాహిత్య ప్రియులకోసం ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాను.సంగీతసాహిత్య ప్రియులని ఈ బ్లాగ్ అలరిస్తుందని ఆసిస్తూ
మీ
మురళి మోహన్

No comments:

Post a Comment