Sunday, May 24, 2015

ఓం  శ్రీ రామ
         
               కీర్తన  : నగుమోము కనలేని నా జాలి  దెలిసి .........                                     రాగం : అభేరి

పల్లవి :        నగు మోము కనలేని  నా జాలి దెలిసి ....నను బ్రోవగ రాదా ? శ్రీ రఘువర !!!
అను పల్లవి  నగరాజ ధర ! నీదు పరివారులెల్ల...
                  ఒగి బోధన చేసెడు వారలు కారే ? ఇటులున్డుదురే?
              .....నీ  నగుమోము (నగుమోము
చరణం :       ఖగరాజు నీ యానతి విని వేగమె చనలేదో ???
                  గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???
                 జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
                  వగ చూపకు (నే) తాళను.....నన్నేలుకోరా !!!
                 త్యాగరాజనుత !!!                                                       (నగుమోము )
                                           ------------------------0--------------------------------

భక్తులకి ,సంగీత సాహిత్య అభిమానులందరికీ నమస్కారం .........
భారత దేశం లో కవిత్వం అంటే కాళిదాసు గుర్తొచ్చినట్టే ,సంగీతం అంటే త్యాగరాజు మనకి గుర్తొస్తారు .
త్యాగయ్య తెలుగువారు కావడం మన అదృష్టం . త్యాగరాజు గొప్ప రామ భక్తుడు . ఆయన భగవంతుడితో
తాదా త్మ్యం  చెంది ఆయనతో అనుబంధం పెంచుకుని సందర్భానుసారంగా తన మనసులోని భావాలని భగవంతుడితో పంచుకుంటూ ,ఒక్కొక్కప్పుడు తన మనసుతో మాట్లాడుతూ పాడిన పాటలే ``త్యాగారాజ కీర్తనలు ''
     త్యాగరాజు తపస్సు సంగీతం,సాహిత్యం ,భక్తి అనే మూడు పాయలుగా ప్రవహించింది అది త్రివేణీ సంగమం . ఆ సంగమం లో మునకలు వేసే భాగ్యం మనకి దక్కడం మన పూర్వ జన్మ సుకృతం  భక్తీ భావం తో నిండిన ఆయన కీర్తనలలోని
``త్యాగరాజ హృదయాన్ని తెలుసుకుని ,ఆ కీర్తనలని  విని , పాదుకొని ఆ అందానుభుతిని అనుభవించి ఆయనతోపాటు మనమూ ఆ పరమాత్ముని దర్శించి తరిద్దాం .
 త్యాగరాజు ఎన్నోవేల కీర్తనలు పాడారు.వాటి లొ ఒక కీర్తన ``నగుమోము కనలేని నాజాలి తెలిసి 'అనే కీర్తన గురించి ముచ్చటించుకుని ,ఆతరువాత ఆ కీర్తనని శ్రీ మురళి గారి గాత్రంలో విని  త్యాగరాజ హృదయాన్ని తెలుసుకుని  ,ఆనందిద్దాం తరిద్దాం

పల్లవి :        నగు మోము కనలేని  నా జాలి దెలిసి ....నను బ్రోవగ రాదా ? శ్రీ రఘువర !!!
అను పల్లవి  నగరాజ ధర ! నీదు పరివారులెల్ల...
                  ఒగి బోధన చేసెడు వారలు కారే ? ఇటులున్డుదురే?
              .....నీ  నగుమోము (నగుమోము
చరణం :       ఖగరాజు నీ యానతి విని వేగమె చనలేదో ???
                  గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???
                 జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
                  వగ చూపకు (నే) తాళను.....నన్నేలుకోరా !!!
                 త్యాగరాజనుత !!!                                                       (నగుమోము )
                                 
    ఈ కీర్తన పల్లవి
``నగుమోము కనలేని నా జాలి దెలిసి  నను బ్రోవగ  రాదా ... శ్రీ రఘువర ''
----------------------------------------------------------------------------------
ఓ ! రఘురామా ! ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే నీ ముఖం చూడాలనే నా దైన్యం అర్ధంచేసుకుని అంటే దీనత్వం అర్ధం   చేసుకుని నాపై నీ కరుణ చూపి /నన్ను కరుణించి నవ్వుతున్న నీ  ముఖం ఒక్కసారి  చుపించరాదా ? అంటూ త్యాగయ్య రాముడిని వేడుకొంటున్నాడు ఆ శ్రీ రాముడి సుందరమైన వదనారవిన్దాన్నిచూడాలనే తన కోరికని వ్యక్తం చేస్తున్నాడు
ఆ త్యాగయ్య కోరిక ఎంత బలంగా వుందంటే పల్లవి లో ఆ రాముడిని వేడుకొన్న ఆయన రాముడు పలకలెదని అనుపల్లవిలో
``నాగరాజ ధర '' అని  సంభోదిస్తూ గోవర్ధన గిరి ఎత్తిన ఆ శ్రీకృష్ణుడిని  పిలఛి ,త్యాగరాజు తను నిత్యం కొలిచే ఆ రాఅమాత్మ ముడికి ,శ్రీకృష్ణ పరమాత్ముడికి బేధం లేదని తెలియజేసారు.ఇక్కడ త్యాగరాజు గారికి రూపాలు,నామాలు వేరైనా ఆ పరమాత్ముడు ఒక్కడే అన్న భావం వుందని మనకి తెలుస్తోంది
``నగరాజ ధర నీదు పరివారులెల్ల ఒగి బోధన చేసెడు  వారలు కారే?
ఇటులున్డుదు రే ??/
అంటే ఓ శ్రీకృష్ణా !!! నీ పరివారం అంటే రుక్మిణి ,సత్యభామ ,గోపికలు ,గోపాలకులు
మొదలైన వారు  ఎవరూ  నాదగ్గరికి వెళ్ళవద్దని చెప్పరే  ??? ఎక్కడైనా అలా ఉంటారా ??? అలాఎలా వుంటారు ??/ అనే సందేహం ,మరెందుకు రావడం లేదు అన్న ఆవేదన వ్యక్తం చేసారు అంటే ఈ లోకం లో భక్తుడిని అనుగ్రహించ వద్దని చెప్పే పరివారం ఉంటారా అన్న అనుమానం  ఆయనకీ కలిగింది త్యాగరాజు  వెంటనే తనకు తానే సర్దిచెప్పుకుని శ్రీ రాముడు తనకి దర్సనం ఇవ్వకపోవడానికి వేరేకారణం ఏదో ఉంటుదని అలొచించారు.ఈ మారు ఆయన అనుమానం ఆ పరమాత్ముని వాహనం మీదికి వెళ్ళింది .
``ఖగరాజు నీ యానతి విని వేగమె చనలేదో ???
                  గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???''
ఒకవేళ నీ వాహనమైన ఆ గరుత్మంతుడు నువ్వు పిలిస్తే రాలేదా ???
వైకున్తానికి ఈ భువికి చాలా దూరం నేను రాలేను అని మీ ఆగ్జ్న ని తోసిపుచ్చారా /తిరస్కరించాడా ?? అని తన రాముడిని వ్యంగ్యం గా   ప్రశ్నించారు  ??/
ఈ చరణం లో  తాను ఎంత వేడినా  శ్రీరాముడు తనకి ఆయన  నగుమోము చుపించలేదన్న  త్యాగయ్య ఆవేదన,ఆక్రోశం వెల్లడౌతాయి.  ఇక్కడ  గమ్మత్తు ఏమిటంటే త్యాగయ్య తన రాముడిని నిన్దించలెదు. ఆయన పరివారాన్ని,ఆయన వాహనమైన గరుత్మంతుడిని అనుమానించి ,మళ్ళీ తనకు తానే  సర్దుకుని

``జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
                  వగ చూపకు (నే) తాళను.....నన్నేలుకోరా !!!''
ఈ విశ్వమంతా నీ ,పరిపాలిస్తున్న ఓ ! పరమాత్మా  నా మొ ర నీతో కాక వేరే ఎవరితో చెప్పుకో గలను? దీనుడను నాకు నువ్వే దిక్కు .ఇంకఉపేక్షించకు.నన్ను మభ్యపెత్తకుండా నీ కోసం నిరీక్షిస్తున్న వెంటనే వచ్చి నీ దర్శనభాగ్యం కలిగించి  నన్ను ఆనుగ్ర హించు అని త్యాగరాజు ఆర్తితో  వేడుకుంటున్నారు
                         

Saturday, May 23, 2015

nagu momu kana leni naa jaali telisi (నగుమోము కనలేని నా జాలి తెలిసి ..).......

                                                                         ఓం  శ్రీ రామ
           
               కీర్తన  : నగుమోము కనలేని నా జాలి లిసి .........                                     రాగం : అభేరి

పల్లవి :        నగు మోము కనలేని  నా జాలి తెలిసి ....నను బ్రోవగ రాదా ? శ్రీ రఘువర !!!
అను పల్లవి  నగరాజ ధర ! నీదు పరివారులెల్ల
                  ఒగి బోధన చేసే వారలు కారే ? అటులున్డుదురే ???....... ( నగుమోము
చరణం :       ఖగరాజు నీ ఆనతి విని వేగమె చనలేదో ???
                  గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???
                 జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
                  వగ చూపకు నే తాళను.....నన్నేలుకోరా !!!
                 త్యాగరాజనుత !!!                                                       (నగుమోము )
                                           ------------------------0--------------------------------

భక్తులకి ,సంగీత సాహిత్య అభిమానులందరికీ నమస్కారం .........
భారత దేశం లో కవిత్వం అంటే కాళిదాసు గుర్తొచ్చినట్టే ,సంగీతం అంటే త్యాగరాజు మనకి గుర్తొస్తారు .
త్యాగయ్య తెలుగువారు కావడం మన అదృష్టం . త్యాగరాజు గొప్ప రామ భక్తుడు . ఆయన భగవంతుడితో
తాదా త్మ్యం  చెంది ఆయనతో అనుబంధం పెంచుకుని సందర్భానుసారంగా తన మనసులోని భావాలని భగవంతుడితో పంచుకుంటూ ,ఒక్కొక్కప్పుడు తన మనసుతో మాట్లాడుతూ పాడిన పాటలే ``త్యాగారాజ కీర్తనలు ''





Sunday, November 27, 2011

మరుగేలరా ,ఓ రాఘవా??(జయంతశ్రీ)

మరుగేలరా ,ఓ రాఘవా?
మరుగేల ? చరాచార రూప ,పరాత్పర ,సూర్య సుధాకర లోచన !.....................మరుగేలరా?
అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య !
నిన్నే గాని మదిని,ఎన్నజాలనారుల ,
నన్ను బ్రోవుమయ్య ,త్యాగరాజనుత,


త్యాగరాజు అంతర్ముఖుడై శోధించి,ఈ చరాచర జగత్తు సర్వం  శ్రీ రాముడే అని ఎరిగిన తరువాత ఇతరులని ఎలా ఆశ్రయించగలనని అంటూ తనని కావమని శ్రీ రాముని వేడుకుంటాడు.ఇది సంపూర్ణ శరణాగతి.
సత్యం ఒకటే అని తెలిసిన జ్ఞాని లక్షణం ఇది.అన్నీ తెలిసిన పరాత్పరునికి ఏ విషయం లోను దాపరికం ఉండబోదు.

నటభైరవి జన్యరాగామైన జయంతశ్రీ రాగంలో త్యాగరాజు రచించిన ఈ కీర్తన తప్ప వేరే ఏ రచనలు లేవు.

సంపూర్ణ శరణాగతి తో పరమ భక్తుడైన త్యాగరాజు తన మనసుని నివెదిస్తూ పాడిన ఈ కీర్తనని ఒక దర్శక ప్రముఖుడు నాయిక నాయకునికి తన మసుని నివేదిన్చుకునే సదర్భంలో ఉపయోగించుకోడం క్షమించరాని నేరం కాదా?

THURSDAY, AUGUST 4, 2011

త్యాగరాజ వైభవం (త్యాగరాజ కీర్తనలకి వివరణ)

నేను ఆంధ్రజ్యోతి డైలీ లో(Tirupat edition) నిర్వహించిన ``కళాజ్యోతి' సంస్కత్రితిక పేజి లో ధారావాహికంగా రాసిన శీర్షిక ``త్యాగరాజ వైభవం''సంగీత సాహిత్య ప్రియులకోసం ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాను.సంగీతసాహిత్య ప్రియులని ఈ బ్లాగ్ అలరిస్తుందని ఆసిస్తూ
మీ
మురళి మోహన్


Saturday, November 26, 2011

సామజ వర గమనా!(హిందోళ)

సామ జ వర గమనా ! సాదు హ్రుత్సారసాబ్జ పాల ,కాలాతీత విఖ్యాత !

సామ నిగమ జ సుధామయ గాన విచక్షణ ,గుణశీల !
దయాలవాల ! మాం పాలయ ..............................సామ జ వర గమన......


వేదశిరో మాత్రు జ సప్తస్వర! నాదాచల దీపా ..స్వీకృత ..
యాదవ కుల మురలీవాదన ,వినోద మోహనాకార
త్యాగరాజ వందనీయ ......................................... సామ జ వర గమన..........

శ్రీరాముని అతీత గుణ సౌందర్యాన్ని వర్ణిస్తూ మురలీగాన వినోది అయిన శ్రీకృష్ణునితో రాముని కలిపివేసి ఆ మొహనరూపాన్నిత్యాగయ్య కీర్తిస్తున్నారు.అమృతంతో సమానమైన గానం సామవేదం నుండి పుట్టింది. సంగీతం లోని సప్తస్వరాలు ఆ వేద శిఖరాల మీద సప్తగిరుల వలె ఉద్భవించాయి.ఈ స్వరాలనుంది ఉద్భవించిన నాదం చలించని దీపం-అంటే ఈ దివ్య నాదం తెంపు గాని స్ఖాలిత్యం గాని లేనిదట!
సామజము అంటే సామ వేదం నుండి పుట్టినది -ఏనుగు.రాముడు దాని నడకలా గంభీరంగా నడచేవాడు
ఇక సంగీతం కూడా సామ వేదం లోనుంచే పుట్టింది . సంగీత స్వర రూపుడైన శ్రీ రామచంద్ర మూర్తి సామ జ వరగమనుడు అనడం పదప్రయోగ రుచిరత్వం.సాదు-హృత్-సారస= సత్పురుషుల మానసములు అనెడి
తామరలు ,అబ్జపాల =నీటిలో పుట్టే కమలాలని పాలించే వాడు(సత్పురుషుల హృదయాలనే కమలాలను పాలించేవాడు)=సూర్యుడు.మాటలను విడదీయడం,కలపడం ఈ పండిత భక్తునికి కూసు విద్య. మనకి ప్రీతిదాయకం.

చాలామందికి ఏనుగు  సామవేదం నుండి పుట్టడం ఏమిటి అనే సందేహం రావొచ్చు.
సామవేదం లో ప్రస్ఫుటమైన స్వరాలు నాలుగు.అవి గ-రి-స-ని. సంగీత శాస్త్రం ప్రకారం ఏనుగు ఘీంకారం నుండి
ని (నిషాదం) పుట్టినదంటారు.కనుక ఏనుగు  సామ గానమైంది.సామ జ వర గమన అనడంలో త్యాగరాజు హృదయం మనకి ఇప్పుడు అవగతమవుతుంది.

త్యాగ రాజు ఈ కీర్తనని హిందోళ రాగంలో పాడారని చెపుతారు.ఆయన హిందోళ రాగం శుద్ధ దైవతం ఉపయోగిస్తూ పాడారు.ఆతరువాత పర్షియన్  సంగీత  ప్రభావం పడి,చతుశ్రుతి దైవతం తో పాడడం సంప్రదాయం అయింది

మాల్కోన్స్ రాగంలో మనకి తెలిసిన పాటలు 
. ఆధాహై చంద్రమా రాత్ ఆది  (నవరంగ్)
.మన్ తడ్పత్ హరి దర్శన్ కో ఆజ్ (బైజు బావరా)
.పగలే వెన్నెలా ,జగమే ఊయల ( పూజాఫలం)
.సందేహించకుమమ్మ  (లవకుశ)
.మనసే అందాల బృందావనం.
ఇంకా ఎన్నో పాటలు వున్నాయి

THURSDAY, AUGUST 4, 2011

త్యాగరాజ వైభవం (త్యాగరాజ కీర్తనలకి వివరణ)

నేను ఆంధ్రజ్యోతి డైలీ లో(Tirupat edition) నిర్వహించిన ``కళాజ్యోతి'సంస్కత్రితిక పేజి లో ధారావాహికంగా రాసిన శీర్షిక ``త్యాగరాజ వైభవం''సంగీత సాహిత్య ప్రియులకోసం ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాను.సంగీతసాహిత్య ప్రియులని ఈ బ్లాగ్ అలరిస్తుందని ఆసిస్తూ
మీ
మురళి మోహన్

Thursday, August 4, 2011

త్యాగరాజ వైభవం (త్యాగరాజ కీర్తనలకి వివరణ)

నేను ఆంధ్రజ్యోతి డైలీ లో(Tirupat edition) నిర్వహించిన ``కళాజ్యోతి' సంస్కత్రితిక పేజి లో ధారావాహికంగా రాసిన శీర్షిక ``త్యాగరాజ వైభవం''సంగీత సాహిత్య ప్రియులకోసం ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాను.సంగీతసాహిత్య ప్రియులని ఈ బ్లాగ్ అలరిస్తుందని ఆసిస్తూ
మీ
మురళి మోహన్