ఓం శ్రీ రామ
కీర్తన : నగుమోము కనలేని నా జాలి దెలిసి ......... రాగం : అభేరి
పల్లవి : నగు మోము కనలేని నా జాలి దెలిసి ....నను బ్రోవగ రాదా ? శ్రీ రఘువర !!!
అను పల్లవి నగరాజ ధర ! నీదు పరివారులెల్ల...
ఒగి బోధన చేసెడు వారలు కారే ? ఇటులున్డుదురే?
.....నీ నగుమోము (నగుమోము
చరణం : ఖగరాజు నీ యానతి విని వేగమె చనలేదో ???
గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???
జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
వగ చూపకు (నే) తాళను.....నన్నేలుకోరా !!!
త్యాగరాజనుత !!! (నగుమోము )
------------------------0---- ----------------------------
భక్తులకి ,సంగీత సాహిత్య అభిమానులందరికీ నమస్కారం .........
భారత దేశం లో కవిత్వం అంటే కాళిదాసు గుర్తొచ్చినట్టే ,సంగీతం అంటే త్యాగరాజు మనకి గుర్తొస్తారు .
త్యాగయ్య తెలుగువారు కావడం మన అదృష్టం . త్యాగరాజు గొప్ప రామ భక్తుడు . ఆయన భగవంతుడితో
తాదా త్మ్యం చెంది ఆయనతో అనుబంధం పెంచుకుని సందర్భానుసారంగా తన మనసులోని భావాలని భగవంతుడితో పంచుకుంటూ ,ఒక్కొక్కప్పుడు తన మనసుతో మాట్లాడుతూ పాడిన పాటలే ``త్యాగారాజ కీర్తనలు ''
త్యాగరాజు తపస్సు సంగీతం,సాహిత్యం ,భక్తి అనే మూడు పాయలుగా ప్రవహించింది అది త్రివేణీ సంగమం . ఆ సంగమం లో మునకలు వేసే భాగ్యం మనకి దక్కడం మన పూర్వ జన్మ సుకృతం భక్తీ భావం తో నిండిన ఆయన కీర్తనలలోని
``త్యాగరాజ హృదయాన్ని తెలుసుకుని ,ఆ కీర్తనలని విని , పాదుకొని ఆ అందానుభుతిని అనుభవించి ఆయనతోపాటు మనమూ ఆ పరమాత్ముని దర్శించి తరిద్దాం .
త్యాగరాజు ఎన్నోవేల కీర్తనలు పాడారు.వాటి లొ ఒక కీర్తన ``నగుమోము కనలేని నాజాలి తెలిసి 'అనే కీర్తన గురించి ముచ్చటించుకుని ,ఆతరువాత ఆ కీర్తనని శ్రీ మురళి గారి గాత్రంలో విని త్యాగరాజ హృదయాన్ని తెలుసుకుని ,ఆనందిద్దాం తరిద్దాం
పల్లవి : నగు మోము కనలేని నా జాలి దెలిసి ....నను బ్రోవగ రాదా ? శ్రీ రఘువర !!!
అను పల్లవి నగరాజ ధర ! నీదు పరివారులెల్ల...
ఒగి బోధన చేసెడు వారలు కారే ? ఇటులున్డుదురే?
.....నీ నగుమోము (నగుమోము
చరణం : ఖగరాజు నీ యానతి విని వేగమె చనలేదో ???
గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???
జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
వగ చూపకు (నే) తాళను.....నన్నేలుకోరా !!!
త్యాగరాజనుత !!! (నగుమోము )
ఈ కీర్తన పల్లవి
``నగుమోము కనలేని నా జాలి దెలిసి నను బ్రోవగ రాదా ... శ్రీ రఘువర ''
------------------------------ ------------------------------ ----------------------
ఓ ! రఘురామా ! ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే నీ ముఖం చూడాలనే నా దైన్యం అర్ధంచేసుకుని అంటే దీనత్వం అర్ధం చేసుకుని నాపై నీ కరుణ చూపి /నన్ను కరుణించి నవ్వుతున్న నీ ముఖం ఒక్కసారి చుపించరాదా ? అంటూ త్యాగయ్య రాముడిని వేడుకొంటున్నాడు ఆ శ్రీ రాముడి సుందరమైన వదనారవిన్దాన్నిచూడాలనే తన కోరికని వ్యక్తం చేస్తున్నాడు
ఆ త్యాగయ్య కోరిక ఎంత బలంగా వుందంటే పల్లవి లో ఆ రాముడిని వేడుకొన్న ఆయన రాముడు పలకలెదని అనుపల్లవిలో
``నాగరాజ ధర '' అని సంభోదిస్తూ గోవర్ధన గిరి ఎత్తిన ఆ శ్రీకృష్ణుడిని పిలఛి ,త్యాగరాజు తను నిత్యం కొలిచే ఆ రాఅమాత్మ ముడికి ,శ్రీకృష్ణ పరమాత్ముడికి బేధం లేదని తెలియజేసారు.ఇక్కడ త్యాగరాజు గారికి రూపాలు,నామాలు వేరైనా ఆ పరమాత్ముడు ఒక్కడే అన్న భావం వుందని మనకి తెలుస్తోంది
``నగరాజ ధర నీదు పరివారులెల్ల ఒగి బోధన చేసెడు వారలు కారే?
ఇటులున్డుదు రే ??/
అంటే ఓ శ్రీకృష్ణా !!! నీ పరివారం అంటే రుక్మిణి ,సత్యభామ ,గోపికలు ,గోపాలకులు
మొదలైన వారు ఎవరూ నాదగ్గరికి వెళ్ళవద్దని చెప్పరే ??? ఎక్కడైనా అలా ఉంటారా ??? అలాఎలా వుంటారు ??/ అనే సందేహం ,మరెందుకు రావడం లేదు అన్న ఆవేదన వ్యక్తం చేసారు అంటే ఈ లోకం లో భక్తుడిని అనుగ్రహించ వద్దని చెప్పే పరివారం ఉంటారా అన్న అనుమానం ఆయనకీ కలిగింది త్యాగరాజు వెంటనే తనకు తానే సర్దిచెప్పుకుని శ్రీ రాముడు తనకి దర్సనం ఇవ్వకపోవడానికి వేరేకారణం ఏదో ఉంటుదని అలొచించారు.ఈ మారు ఆయన అనుమానం ఆ పరమాత్ముని వాహనం మీదికి వెళ్ళింది .
``ఖగరాజు నీ యానతి విని వేగమె చనలేదో ???
గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???''
ఒకవేళ నీ వాహనమైన ఆ గరుత్మంతుడు నువ్వు పిలిస్తే రాలేదా ???
వైకున్తానికి ఈ భువికి చాలా దూరం నేను రాలేను అని మీ ఆగ్జ్న ని తోసిపుచ్చారా /తిరస్కరించాడా ?? అని తన రాముడిని వ్యంగ్యం గా ప్రశ్నించారు ??/
ఈ చరణం లో తాను ఎంత వేడినా శ్రీరాముడు తనకి ఆయన నగుమోము చుపించలేదన్న త్యాగయ్య ఆవేదన,ఆక్రోశం వెల్లడౌతాయి. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే త్యాగయ్య తన రాముడిని నిన్దించలెదు. ఆయన పరివారాన్ని,ఆయన వాహనమైన గరుత్మంతుడిని అనుమానించి ,మళ్ళీ తనకు తానే సర్దుకుని
``జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
వగ చూపకు (నే) తాళను.....నన్నేలుకోరా !!!''
ఈ విశ్వమంతా నీ ,పరిపాలిస్తున్న ఓ ! పరమాత్మా నా మొ ర నీతో కాక వేరే ఎవరితో చెప్పుకో గలను? దీనుడను నాకు నువ్వే దిక్కు .ఇంకఉపేక్షించకు.నన్ను మభ్యపెత్తకుండా నీ కోసం నిరీక్షిస్తున్న వెంటనే వచ్చి నీ దర్శనభాగ్యం కలిగించి నన్ను ఆనుగ్ర హించు అని త్యాగరాజు ఆర్తితో వేడుకుంటున్నారు
కీర్తన : నగుమోము కనలేని నా జాలి దెలిసి ......... రాగం : అభేరి
పల్లవి : నగు మోము కనలేని నా జాలి దెలిసి ....నను బ్రోవగ రాదా ? శ్రీ రఘువర !!!
అను పల్లవి నగరాజ ధర ! నీదు పరివారులెల్ల...
ఒగి బోధన చేసెడు వారలు కారే ? ఇటులున్డుదురే?
.....నీ నగుమోము (నగుమోము
చరణం : ఖగరాజు నీ యానతి విని వేగమె చనలేదో ???
గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???
జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
వగ చూపకు (నే) తాళను.....నన్నేలుకోరా !!!
త్యాగరాజనుత !!! (నగుమోము )
------------------------0----
భక్తులకి ,సంగీత సాహిత్య అభిమానులందరికీ నమస్కారం .........
భారత దేశం లో కవిత్వం అంటే కాళిదాసు గుర్తొచ్చినట్టే ,సంగీతం అంటే త్యాగరాజు మనకి గుర్తొస్తారు .
త్యాగయ్య తెలుగువారు కావడం మన అదృష్టం . త్యాగరాజు గొప్ప రామ భక్తుడు . ఆయన భగవంతుడితో
తాదా త్మ్యం చెంది ఆయనతో అనుబంధం పెంచుకుని సందర్భానుసారంగా తన మనసులోని భావాలని భగవంతుడితో పంచుకుంటూ ,ఒక్కొక్కప్పుడు తన మనసుతో మాట్లాడుతూ పాడిన పాటలే ``త్యాగారాజ కీర్తనలు ''
త్యాగరాజు తపస్సు సంగీతం,సాహిత్యం ,భక్తి అనే మూడు పాయలుగా ప్రవహించింది అది త్రివేణీ సంగమం . ఆ సంగమం లో మునకలు వేసే భాగ్యం మనకి దక్కడం మన పూర్వ జన్మ సుకృతం భక్తీ భావం తో నిండిన ఆయన కీర్తనలలోని
``త్యాగరాజ హృదయాన్ని తెలుసుకుని ,ఆ కీర్తనలని విని , పాదుకొని ఆ అందానుభుతిని అనుభవించి ఆయనతోపాటు మనమూ ఆ పరమాత్ముని దర్శించి తరిద్దాం .
త్యాగరాజు ఎన్నోవేల కీర్తనలు పాడారు.వాటి లొ ఒక కీర్తన ``నగుమోము కనలేని నాజాలి తెలిసి 'అనే కీర్తన గురించి ముచ్చటించుకుని ,ఆతరువాత ఆ కీర్తనని శ్రీ మురళి గారి గాత్రంలో విని త్యాగరాజ హృదయాన్ని తెలుసుకుని ,ఆనందిద్దాం తరిద్దాం
పల్లవి : నగు మోము కనలేని నా జాలి దెలిసి ....నను బ్రోవగ రాదా ? శ్రీ రఘువర !!!
అను పల్లవి నగరాజ ధర ! నీదు పరివారులెల్ల...
ఒగి బోధన చేసెడు వారలు కారే ? ఇటులున్డుదురే?
.....నీ నగుమోము (నగుమోము
చరణం : ఖగరాజు నీ యానతి విని వేగమె చనలేదో ???
గగనానికి ఇలకు బహు దూరంబనినారో ???
జగమేలే పరమాత్మా ........ఎవరితో మొరలిడుదు .....
వగ చూపకు (నే) తాళను.....నన్నేలుకోరా !!!
త్యాగరాజనుత !!! (నగుమోము )
ఈ కీర్తన పల్లవి
``నగుమోము కనలేని నా జాలి దెలిసి నను బ్రోవగ రాదా ... శ్రీ రఘువర ''
------------------------------